Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు మండలంలో కమ్యూనిస్టు కంచుకోటగా పేరుగాంచిన కల్వకుంట గ్రామంలో నరసింహ వరుసగా రెండుసార్లు సర్పంచిగా గెలుపొంది 12 సంవత్సరాలు, నరసింహ తన భార్య ఐదు సంవత్సరాలు పాలనలో గ్రామ అభివద్ధి కోసం అహర్నిశలు కషి చేస్తూ తను చిన్నతనం నుండే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన నిలిచిన నాయకుడు నరసింహ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన నరసింహ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహ అకాల మతి పార్టీకి తీరని లోటన్నారు. నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆశయ సాధన కోసం అడుగులు వేయాలని కోరారు. అనంతరం టీ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్, చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటాలు నిర్వహించి సర్పంచిగా నరసింహ చేసిన సేవలు మరువలేనివి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దోనూరి నర్సిరెడ్డి , డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని విజరుకుమార్, వెల్మకన్నె ఎంపీటీసీ , జిల్లానాయకులు చాపల మారయ్య , మునుగోడు సర్పంచ్ , మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న, కల్వకుంట్ల సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య, కల్వకుంట్ల గ్రామ కార్యదర్శి నారబోయిన నరసింహ , బొందు అంజయ్య , వడ్లమూడి హనుమయ్య , పర్సనగోని యాదగిరి వరికుప్పల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.