Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూజిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్
కార్మిక ఐక్య ఉద్యమాల సారథి సీఐటీయూ అని, కార్మికులకు అండ సీఐటీయూ జెండా అని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం అన్నారు. ఆ సంఘం ఆవిర్భవించి 51 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెంలోని వంశీ రబ్బర్ కంపెనీ ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 30న కలకత్తా నగరంలో సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. నాటి నుండి నేటి వరకు 51 సంవత్సరాల్లో దేశంలో అనేక కార్మిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించిన ఘనత సీఐటీయూకే దక్కుతుందన్నారు. దేశంలో 20 లక్షల మంది రైల్వే ఉద్యోగులతో జరిగిన సమ్మెలో కషి ఉందని తెలిపారు. నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దుచేశాడని విమర్శించారు. నేడు నాలుగు కార్మిక కోడ్లను తీసుకువస్తున్నారని, ఇవి అమలు జరిగితే కార్మిక హక్కులు కళగానే మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక శ్రమశక్తిని దోచుకోవడానికి 8 గంటలుగా ఉన్న పని విధానాన్ని నేడు 12 గంటలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్లు తీసుకువస్తుందని, వీటికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో కార్మిక కుటుంబాలు, పేదలను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాదిరిగా ఉత్పత్తిలో భాగస్వాములుగా ఉన్న కార్మికులకు కేంద్రం ప్రకటించిన ప్రమాద బీమా రూ.50 లక్షలు వర్తింపజేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో వంశీ రబ్బర్ పరిశ్రమ యూనియన్ జనరల్ సెక్రెటరీ మల్లేశం, యుగంధర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు