Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు లిఫ్టులకు రూ.585కోట్లు మంజూరు
- జూన్ 15 నాటికి కొత్త లిఫ్టులకు డీపీఆర్లు సిద్ధం చేయాలి
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త ఐదు లిఫ్టులపై నీటిపారుదల శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చడం జరిగిందన్నారు.ఐదు లిఫ్టులకు రూ.585 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారని గుర్తు చేశారు.ఈ ఎత్తిపోతల ద్వారా అప్పరుప్లాటు రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు.నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు.నాగార్జునసాగర్ నిర్మాణంలో ముంపునకు గురై పునరావాసాలుగా ఉన్న గ్రామాలు, తండాల ప్రజలు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారన్నారు. ఐదు లిఫ్టులతో 32వేల ఎకరాలకు సాగునీరందనుందన్నారు.జూన్ 15 నాటికి కొత్త ఐదు లిఫ్టులకు డీపీఆర్లు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం తాగు, సాగునీరుకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రైతుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.గుట్టలు, కొండలు ఉండటం ద్వారా సాగర్ నీరు అందడం లేదని, ఎత్తిపోతల ద్వారా సాగర్ బ్యాక్ వాటర్ నీరు పారుదల సౌకర్యం కల్పించడం వల్ల సస్యశ్యామలంగా అవు తుందన్నారు.ఐదు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసి పొగిళ్ల, కంబాలపల్లి, అంబాభవాని, పెద్దగట్టు, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు తెలిపిందన్నారు. పొగిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.24.64 కోట్లు, కంబాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.202.15 కోట్లు, అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.184.56 కోట్లు, పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.82.727 కోట్లు, ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.90.96 కోట్లతో పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరందించాలనే లక్ష్యంతో అవసరమైన ప్రతీ చోటా ప్రత్యేక ప్రాజెక్టును, ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసిందన్నారు. నల్లగొండను 'నీళ్ల కుండ'గా మార్చాలనే లక్ష్యంతో ఆరేండ్లలోనే ఏకంగా రూ.2,417 కోట్లు వెచ్చించిందని, ప్రభుత్వం దష్టిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్న ప్రత్యేక స్థానానికి ఇదే నిదర్శనమన్నారు.ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.