Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
మండలంలోని శారాజిపేటలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు శివశంకర ఆధ్వర్యంలో బీర్ల పౌండేషన్ చైర్మెన్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య సహకారంతో శారాజీపేటలో కారోనా బాధితులకు ఆదివారం పౌష్టికాహారం మాస్కలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గందమల్ల అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు , కోశాధికారి దూడల అనిల్ ,కుమార్ ప్రచార కార్యదర్శి లాలూ ప్రసాద్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుకు కిష్టయ్య ,కంతి మధు ,నర్సింలు, ఉపేందర్, వెంకటేష్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదరు కళ్యాణ్ సంతు రవి బంటి మల్లేష్ సునీల్ మనోజ్ యూత్ అధ్యక్షుడు ఊట్కూరి సురేష్ గౌడ్ ,అజరు, రమేష్ జహంగీర్ ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని గొలనుకొండ గ్రామంలో పాడి రైతులకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పాల ఉత్పత్తిదారుల కేంద్రం వద్ద బీర్లా యువసేన నాయకులు మాస్కులు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో అడ్వకేట్ హరిబాబు బిర్లా ఫౌండేషన్ కమిటీ సభ్యులు లగా నీ కుమార్ ,అశోక్ ,మధు ,కర్ణాకర్ ,అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని టంగుటూరులో ఇటీవల గుండెపోటుతో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చిన్న ఉప్పలయ్య మృతిచెందాడు. ఆదివారం కుటుంబానికి ఆ యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సాయంఅందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు శ్రావణ్, ఉపాధ్యక్షుడు అశోక్ మధు, ప్రధాన కార్యదర్శి రాజు ,కోశాధికారి శ్రీను ,సహాయ కార్యదర్శులు శ్రీకాంత్, నవీన్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని మందనపల్లి గ్రామంలో ఆదివారం బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హమాలీకార్మికులకు మాస్కులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య, వైస్ ఎంపీపీ ఆలేరు గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ ,3వ వార్డు సభ్యులు కడకంచి పద్మరాజు ,యూత్ మండల్ అధ్యక్షుడు ఊట్కూరి సురేష్ పాల్గొన్నారు.
మండలంలోని టంగుటూరు గ్రామంలో ఇటీవల కరోనాతో మరణించిన ఏలెగందుల లక్ష్మి కుటుంబానికి టీపీసీసీ రాష్ట్ర సెక్రెటరీ జనగాం ఉపేందర్ రెడ్డి 50 కిలోల బియ్యం ఆదివారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షలు జాలపు మధు సుధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి మురళి, గ్రామ శాఖ కార్యకర్తలు .వెంకటేష్,విష్ణు, విట్టల్, వెంకటయ్య, నాగరాజు, రాములు, గోపాల్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : కరోనా కష్టకాలంలో గ్రామాలను శుభ్రపరుస్తున్న పారిశుధ్యకార్మికులను అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కార్మికులకు మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు, పాదరక్షలు, నిత్యావసరాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, బొలగాని సత్యనారాయణ, కారోబార్ బుగ్గ శ్రీశైలం, వంగాల చంద్రమౌళి, బాల్ద వెంకటేష్, ఎగ్గిడి వెంకటేష్, కార్మికులు బోగారం వీరస్వామి, యాదయ్య, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక అలుమటిస్తున్న అన్నార్తులకు నీల ఓంప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణకేంద్రంలో మున్సిపల్ వైస్చైర్మెన్ చింతల కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ సైదులు ఆహార ప్యాకెట్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, నోముల మహేందర్ రెడ్డి, జనగాం మహేష్, బందారపు రంజీత్,గొడ్డెట్టి యాదగిరి యాదవ్ ,శెట్టి శ్రీకాంత్,బబ్బూరి మదు,నీల భరత్ లు పాల్గొన్నారు.
భువనగిరి :భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ , పట్టణ పోలీస్ స్టేషన్, మహిళ పోలీస్ స్టేషన్ లలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసులకు శానిటైజర్, మాస్కులు, ఓఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మెన్ ఎండీ.బబ్లూ ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ,నాయకులు బాబా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, ఎన్ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, పాల్గొన్నారు.