Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై తిరగబడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం రోజున ఆ సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బజారు హమాలీల యూనియన్ జెండాను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చే విధానాలను చేయకపోగా, ప్రయోజనాలు చేకూర్చే చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులు యథేచ్ఛగా శ్రమ దోపిడీ చేసేందుకు వీలుగా లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకు పోరాడుదామన్నారు. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మంగ అరవింద్, నాయకులు అంగిరేకుల సత్య నారాయణ, హమాలీ కార్మికులు పాల్గొన్నారు
ఎర్ర జెండా కార్మికులకు అండ
నార్కట్పల్లి :ఎర్రజెండా బడుగు బలహీన వర్గాల, కార్మికులకు అండ అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న అన్నారు. ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదుట ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలకు అమలు చేస్తున్న ప్రభుత్వాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎస్కే.నన్నే సాహెబ్, బొల్లెద్దు సైదులు, నరుకుడు బిందెల నరసింహ, ఎల్లయ్య షకీల్, తదితరులు పాల్గొన్నారు.