Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో లాక్డౌన్ను పొడిగిస్తూ జూన్ 10వరకు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గతంలో తీసుకున్న లాక్డౌన్ గడువు ముగిసింది. దాంతో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉదయం 6నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడిలింపు చేశారు. కానీ నేటి నుంచి ఉదయం 6గంటల నుంచి 1గంట వరకు సడలింపు ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పకడ్బందీగా లాక్డౌన్ విధించనున్నారు. వారంతంలో శని, ఆదివారం రెండు రోజులు సంపూర్ణంగా లాక్డౌన్ విధించాలని ప్రకటించారు. ఇప్పటివరకు లాక్డౌన్ అత్యంత కట్టుదిట్టంగా కొనసాగింది. పోలీసులు పూర్తి బందోబస్తుతో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి వారు ప్రయాణాలు చేపట్టినా వారిని నిలిపివేయడంతో సంపూర్ణంగా ఇప్పటివరకు కొనసాగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల వైరస్ ఉధృతిలో కూడా కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ప్రయాణాలు చేయాలంటే ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో పోలీసు అధికారులు నిత్యం 24గంటలు రోడ్లపైనే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నారు. లాక్డౌన్ విధించిన మొదట్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికి ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుని లాక్డౌన్కు ఏలాంటి అటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు. వైద్యం, విద్యుత్, జర్నలిస్టులకు మినహాయింపును ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడ విధులకు హాజరయ్యే సమయంలో తమ గుర్తింపు కార్డులు తమ వద్దనే పెట్టుకోవాలని సూచించారు. దానివల్ల ఏలాంటి సమస్యలు రావని ప్రభుత్వం పెర్కొంటుంది. భవిష్యత్ లాక్డౌన్ సమయంలో కూడ ఇదే విధంగా కొనసాగనుంది. అయితే సడలింపు ఎక్కువ సమయం ఇచ్చినందున అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని ప్రభుత్వం పెర్కొంది.