Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి దాసరి పాండు అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి ఇండిస్టీ ఏరియాలో ఆ యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సీఐటీయూ ఆవిర్భావాం నాటి నుండి కార్మిక సమస్యలు పరిష్కారం అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. పరిశ్రమల్లో, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కనీస వేతనం రూ. 24వేలు చెల్లించాలని, ఇండిస్టీ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలో అనుబంధ రంగాలు మున్సిపల్,ట్రాన్స్పోర్ట్, తోపుడు బండ్లు, హమాలీ, బిల్డింగ్ తదితర రంగాల జెండాలను ఆవిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ కన్వీనర్ మయకష్ణ, నాయకులు ప్రసాద్, ఎల్లయ్య, సుధాకర్, నరసింహ, ఈశ్వర్, లక్ష్మీ, మల్లేశ్వరి, కోటమ్మ, హేమలత, పరమేశ్వరి, అలివేల, అనిత, హరి పాల్గొన్నారు.