Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని మండలాలకూ ఆక్సిమీటర్లు అందజేస్తున్నాం..
- డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రెండో దశ కరోనా ఉధృతి సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలను ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కోవిడ్ బాధితులకు సహకారంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన భువనగిరితో మండలంలో కోవిడ్ బాధితులను పరామర్శించారు. వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికీ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సి మీటర్లు అందజేసినట్టు తెలిపారు. కోవిడ్ బాధితులకు సహకరించడానికి యూత్ కాంగ్రెస్ వారు ముందుండి సహకరించడం అభినందనీయమన్నారు. ఆక్సిజన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం జిల్లాకేంద్ర ఆస్పత్రి, ఎయిమ్స్‌లో లేదన్నారు. పక్క రాష్ట్రం చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తుందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో చనిపోయిన కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా మతుల కుటుంబాలకు అండగా ఉంటాం
బీబీనగర్ : మండలంలో కరోనా వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు కాంగ్రెస్‌పార్టీ, తాము అండగా ఉంటామని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నెమురగోముల గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు సంకూరి జంగయ్య, జియాపల్లిలో ఓరుగంటి అనిల్‌గౌడ్, మండలకేంద్రంలోని గొలనుకొండ దశరథ, పేరబోయిన శ్రీశైలం, పుట్ట బాలమణి, టంటం పాండు కుటుంబాలను పరామర్శించి, కుటుంబసభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల్లో ఉన్నత చదువులు చదివే వారికి అయ్యే ఖర్చులకు తాను సాయం చేస్తానని తెలిపారు. పడమటిసోమారం గ్రామ సర్పంచ్ గణేశ్యాదవ్ను పరామర్శించి, సానుభూతి తెలిపారు. మండలవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్న వారు తాను ఏర్పాటుచేసిన ఆక్సిజన్ సిలిండర్లతో సేవలు పొందాలని తెలిపారు.
ఆశావర్కర్లకు పల్స్ ఆక్సీ మీటర్లు పంపిణీ
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతోపాటు, కొండమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పల్స్ ఆక్సీ మీటర్లను కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ గడ్డం బాలకష్ణగౌడ్, ఎంపీటీసీలు గోళి నరేందర్‌రెడ్డి, టంటం భార్గవ్, నాయకులు చెరుకు అచ్చయ్యగౌడ్, పంజాల పెంటయ్యగౌడ్, టంటం లక్ష్మయ్య, సందిగారి బస్వయ్య, ఆగమయ్యగౌడ్, పంజాల సత్తయ్య, బెండ ప్రవీణ్, కడెం రాజేశ్‌బాబు, గూడూరు నిఖిల్‌రెడ్డి, బద్దం వాసుదేవరెడ్డి, గోపినాయక్ పాల్గొన్నారు.