Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిట్యాల
మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న 15 మందికి ఆ గ్రామ సర్పంచ్ రత్నం పుష్పమ్మనర్సింహా సోమవారం చికెన్, గుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు 14 రోజుల పాటు హోం ఐసోషన్లో ఉండాలని సూచించారు. కరోనా వచ్చిందని ఆందోళన చెందకుండా పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచకొండ శ్రీనివాస్, మారగోని శివశంకర్, కొయగూర నర్సింహ, జవాజిశేఖర్, బొడిగె సాయికుమార్, చెరుకు స్వామి, చెరుకు మధుసూధన్, బొడిగె ప్రభాకర్, గరిషె చిట్టిబాబు, చెరుకు రామలింగం, బుస్సు మధుసూధన్, పానుగుళ్ల వెంకటేశం, గోపగోని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.