Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కోవిడ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు
నవతెలంగాణ - వేములపల్లి
కరోనా వచ్చిందని ఎవరూ అధైర్య పడొద్దని, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కరోనా హెల్ప్‌లైన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో మనోధైర్యం కల్పించడానికి, తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పాదూరు శశిధర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, మండల కార్యదర్శి పతాని శ్రీను, నాయకులు ఆంజనేయులు, యల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో చికిత్స పొందే వారు పాదూరి శశిధర్‌రెడ్డి 9849625359, ప్రణీత్‌రెడ్డి 9642075077, వరలక్ష్మి 8978962557, పతాని శ్రీను 8555989393 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.