Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినతరం
- ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలి
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పూర్తిగా భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్లో జిల్లా మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో వయోవద్ధులు,వికలాంగులకు సులభంగా టీకా కార్యక్రమం కరపత్రాన్ని కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ మరో 10 రోజులు పెంచడంతో జిల్లాలో ఇంకా పటిష్టంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో టీకా తీసుకునే వయోవద్ధులు 14567, , వికలాంగులు 18005728980 టోల్ఫ్రీకి కాల్ చేస్తే సత్వరమే స్పందిస్తామన్నారు.ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తప్పక వినియోగించుకోవాలన్నారు.జిల్లాలో మధ్యాహ్నం 2 నుండి ఉదయం 6.00 గంటల దాకా ఆంక్షలు కఠినంగా అమలులో ఉంటాయని తెలిపారు.జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి క్రమ క్రమంగా తగ్గుతుందని, ప్రజలు అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలపై వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టామన్నారు.సరిహద్దులలో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామనిచెప్పారు.లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రభుత్వ పనిదినాలలో మార్పులు చేసిందన్నారు.స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు రవాణా శాఖ అధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం అను మతులు కల్పించిందన్నారు.ఆ దిశగా సంబంధిత అధి కారులు చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలు ఇంటికి చేరడం కోసం మధ్యాహ్నం 1-2 గంటల మధ్య సమయం అదనంగా కల్పించిందన్నారు.జిల్లాలో అన్ని ప్రభుత్వా స్పత్రుల్లో ఆక్సిజన్, మందుల కొరత లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీడీ నర్సింహారావు, డీపీఓ యాదయ్య పాల్గొన్నారు.