Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాభాల బాటలో నడుస్తోందని ఆ బ్యాంకు చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక వర్గం ఏర్పడి సంవత్సరం అవుతుందని, ఒకే సంవత్సరంలో బ్యాంకు రూ.11 కోట్ల లాభాల్లో ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణకు నాబార్డు రూ.16 కోట్లు ఇస్తే రూ.12 కోట్లకు పైగా రైతులకు క్లెయిమ్ చేశామన్నారు. బ్యాంకును లాభాల బాటలో సాగిస్తున్న సహకార బ్యాంకు చైర్మెన్లు, డైరెక్టర్లు, బ్యాంకుల సీఈవో, జీఎం, సీజీఎంలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సహకారంతో బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో సీఈవో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.