Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లాత్ మర్చంట్ అసోసియేషన్ జిల్లా పట్టణాధ్యక్షులు గండూరి శంకర్, గండూరి కపాకర్
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
సూర్యాపేట క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాత్రి భోజనాలు అందజేయడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి శంకర్, పట్టణ అధ్యక్షులు గండురి కపాకర్ అన్నారు.సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కరోనా రోగులకు, వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ 20 రోజులుగా లాక్డౌన్ విధించడంతో హాస్పిటల్కు వచ్చిన రోగులు,వారి బంధువులకు హోటళ్లు బంద్ కావడంతో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని గమనించి మానవతా దృ క్పథంతో,దాతల సహకారంతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు.కరోనా సోకిన పేషెంట్లు గానీ, వారి సహకారులుగా వచ్చిన వారుగానీ తప్పనిసరిగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ఇస్తున్న సలహాలు,సూచనలు తప్పకుండా పాటించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు.లాక్డౌన్ నిర్వహించినన్ని రోజులు తప్పకుండా ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.ఇందుకు సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు, ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.వ్యాపారరంగంలో రాణిస్తూనే సమాజసేవలో పాలు పంచు కోవడం గర్వకారణమన్నారు.ప్రతి ఒక్కరూ తమవంతుగా పేదలను ఆదుకోవాలని కోరారు.లాక్డౌన్ ముగిసే వరకు రాత్రి భోజనాలు అందిస్తామని, రోగులు, వారిబంధువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చంట్ అసోసియేషన్తెలుకుంట్ల వెంకటేశ్వర్లు, కుక్కడపు భిక్షం,దూలంనగేష్,పాపని యాదగిరి, యాలగందుల లక్ష్మయ్య,,కొప్పు సందీప్, గౌతమ్,రాపోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.