Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బొమ్మలరామారంం
కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.ఉదయం 6 గంటల నుండి 1 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంటాయి 2 గంటల నుండి లాక్ డౌన్ కొనసాగుతోంది. సమయం కూడా పొడిగించినందున కొంతమంది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వివిధ అవసరాల కోసం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ,ముఖ్యంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా వాళ్ళు కనీసం మాస్కులు లేకుండా సోమవారం చీకటిమామిడి గ్రామంలో మార్కెట్కు వచ్చారు.పెండ్లిండ్ల సీజన్ కావడంతో చాలా మంది అధిక సంఖ్యలో వస్తున్నారు, రోడ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఎక్కడ చూసినా జనం మెడికల్ షాప్లో వద్ద హాస్పిటల్ వద్ద గుంపులుగా ఉంటున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం మాస్కు కూడా ధరించడంలేదని, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.