Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
మండలంలోని వెల్లంకి గ్రామంలో కరోనా బారిన పడిన కుటుంబాలకు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బందికి సీపీఐ (ఎం) కోవిడ్ హెల్ప్ లైన్ కేంద్రం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కూరెళ్ళ నర్సింహ్మ చారి అందజేసిన రూ.25 వేల విలువగల నిత్యావసర సరుకులు పంపిణీి చేశారు. కూరగాయలు, పండ్లు, మాస్కులు, గుడ్లు, పౌష్టికాహారంతో కూడిన కిట్లను 45 కరోనా బాదిత కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సీపీఐ(ఎం) హెల్ప్ లైన్ కేంద్రం పెట్టి 24 గంటలు కరోనా రోగులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ కూరెళ్ళ నర్సింహ్మ చారి, శాఖ కార్యదర్శి వనం ఉపేందర్, ఎంపీటీసీ ఎర్రోళ్ళ లక్ష్మమ్మ నరసింహ, నాయకులు ఆవనగంటి నగేష్, అంకం మురళి, చెన్నోజు వినరు, బండ్ల పవణ్, తాటిపాముల ఉదరు, అంకం జ్యోతీబసు, కన్నేబోయిన రాజు, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో ఇటీవల మృతిచెందిన గుడిసెల సత్తమ్మ కుటుంబానికి సోమవారం బీర్ల్ల ఫౌండేషన్ చైర్మెన్ ఐలయ్య సహకారంతో 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మురళి ,ఉపాధ్యక్షుడు గజరాజుల బుచ్చి రాములు, కార్యదర్శి బండి రాములు, ఐలయ్య అభిమాని అఖిల్, సీనియర్ నాయకులు గుండ్ల సంజీవరెడ్డి ,నర్సింలు, ఉపేందర్ పాల్గొన్నారు.
భువనగిరి : మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో జడల యశీల్ గాడ్ ఆర్థిక సహాయంతో కూరగాయలు మాస్కులు శానిటైజర్లను జిల్లా గ్రంథాలయ చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనగాం పాండు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకట్ గౌడ్, మండడలపాధ్యక్షులు సిలివేరు యేసు, గ్రామ సర్పంచ్ పుష్ప ఎల్లయ్య,వార్డ్ సభ్యులు సిలివేరు బిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు సిలివేరు మధు,నాగులు బాలయ్య, జనగామ మహేష్ పాల్గొన్నారు.
నిరుపేదలకు అన్నదానం
పట్టణంలోని 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ సొంత నిధులతో, దాతల సహకారంతో రైల్వే స్టేషన్, బస్ స్టాప్, మెడికల్ సిబ్బందికి, 180 మంది నిరుపేదలకు, యాచకులకు, చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెన్న స్వాతి, వార్డ్ అధ్యక్షులు గాదె శ్రీనివాస్, నాయకులు నరేష్ , ఆటో శేఖర్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి: ప్రధాని నరేంద్రమోడీ ఏడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి స్నేహితుడి కూతురు అట్లూరి ఉమసహకారంతో నిమిషానికి 7 లీటర్ల ఉత్పత్తి చేయగల మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఆ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు గంజి బస్వలింగం గూడూరు నారాయణరెడ్డి చేతులమీదుగా పంపిణీచేశారు. పార్టీలకతీతంగా కరోనా బారిన పడినవారు ఎవరైనా ఆక్సిజన్ అవసరముంటే బీజేపీ పట్టణశాఖ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ సీనియర్ నాయకులు యెన్నం శివకుమార్, చిక్క కష్ణ,నోముల గణేష్,సాహిషు, శ్రీను,యాదగిరి, సుశీల ,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.