Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జనార్దన్ మృతి విప్లవోద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జలగం జనార్థన్ (జన్ను) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, తుంగతుర్తి తాలూకాలోని భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి జనార్థన్ అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు బొమ్మిడి నగేష్, కల్లూరి అయోధ్య, జానపాటి శంకర్, చింతల వెంకటరమణ, సత్యం, ఉపేందర్, జానీ, చారి, వెంకట్, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.