Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండూరు
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని గట్టుప్పల గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలు, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, గట్టుప్పల సర్పంచ్ ఇడం రోజా గ్రామంలోని ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించి కరోనా బాధితులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాసాల జనార్దన్ రెడ్డి, గట్టుప్పల శక్తి కేంద్ర ఇన్చార్జి రాపోలు గోపీనాథ్, కర్నాటి రవితేజ, కొంగరి నరహరి, ఏలె శివశంకర్, గంజి కృష్ణయ్య, తిరందాసు చక్రపాణి, గంజి శంకర్, పగిళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.