Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన ప్రముఖులు
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
మండలంలోని ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక సహకార సంఘం చైర్మెన్ గంట నర్సిరెడ్డి సోమవారం మతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడి ఆయన తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత ఇతర సమస్యలతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందారు. విషయం తెలుసుకున్న నల్లగొండ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బత్తుల ఊషయ్య, మాజీ ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డిలు మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న నర్సిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్ ఆయన అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంట నర్సిరెడ్డి ప్రతి ఒక్కరికీ ఆత్మీయుడిగా ఉండేవారన్నారు. ఈ కార్యక్రమంలో షేర్బారు గూడెం సర్పంచ్ పద్మసత్తి రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ బత్తుల అనంతరెడ్డి, డైరెక్టర్ పి.శంకర్‌రెడ్డి, దండు రవి, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.