Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.40 వేల కోట్లతో సంక్షేమ రంగానికి పెద్దపీఠ
- వరి దిగుబడిలో తెలంగాణానే టాప్
- రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
- ఆచార్య జయశంకర్, తెలంగాణా తల్లి విగ్రహాలకు నివాళులు
- అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం నేడు వరి దిగుబడిలో రికార్డ్ సష్టించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనికతనే కారణమని ఆయన అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్ర ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఉదయం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.అంతకుముందు పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించిన ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.అనంతరం ఆచార్య జయశంకర్,తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభిం చారు.కోవిడ్ నిబంధనల నేపధ్యంలో సాదా సీదాగా ఎంతో నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని నిర్వహి ంచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణకు ముందు తెలంగాణ ప్రాంతంలో 13 నుండి 14 లక్షల దిగుబడి మాత్రమే ఉండగా అది ఇప్పుడు కోటి మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు.యావత్ భారతదేశంలోనే వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సష్టిస్తే అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్ నమోదు చేసిందన్నారు.అందుకు కారణం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.రాష్ట్ర అవతరణకు ముందు సాగు నీరు కాదు కదా తాగునీరు కూడా లేక ఎండమావిగా నిలిచిం దన్నారు.అటువంటి రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందిస్తూ తెలంగాణా రాష్ట్రం యావత్ బరతదేశానికే ఆదర్శవంతంగా నిలిస్తే కోటి 40 లక్షల ఎకరాలకు సమద్ధిగా నీరు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడుగా మారారని కొనియాడారు. విద్యుత్ విషయంలో అద్భుతమైన విజయాల్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరందించి రైతాంగానికి దార్శనికుడిగా నిలిచారన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకే పాలన కొనసాగుతుందని చెప్పారు.పాలనలో దివంగతఆచార్య జయశంకర్ సార్ మనోభిస్టం ప్రతిబింబిస్తుందన్నారు.రూ.40 వేల కోట్లతో సంక్షేమరంగాన్ని పరుగులు పెట్టించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కోవిడ్ నిబంధనలతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుకుంటున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్న పూర్ణమ్మ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.