Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా హెల్ప్‌లైన్ కేంద్రాలుగా సీపీఐ(ఎం) కార్యాలయాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండ
కరోనా కట్టడికి ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున కోరారు. బుధవారం కరోనా మండల కేంద్రంలో ఉన్న సీపీఐ(ఎం) కార్యాలయంలో కరోనా హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయన్నారు. కరోనా కట్టడికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. ఫలితంగా అనేక మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా ఆక్సిజను అందించలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కరోనాతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, కనగల్ మండల కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు కానుగు లింగస్వామి, ఎమ్‌డి,అక్రమ్, నెలగొందరాషి లింగయ్య, వేముల సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.