Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రైతులకు నాణ్యమైన పంట నారును, నాణ్యమైన విత్తనాలను అందించాల్సిన బాధ్యత నర్సరీల యాజమాన్యంపై ఉందని ఎస్పీ ఆర్.భాస్కరన్ స్పష్టం చేశారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో, నర్సరీల యజమానులతో సమావేశం నిర్వహించారు.ఈ సంధ ర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు వస్తు న్నాయని,ఇతర ప్రాంతాల నుండి విడిగా నాణ్యత తక్కువ విత్తనాలు కొనుగోలు చేసి పంట నారును పెంచొద్దన్నారు.నాణ్యత తక్కువ పంటనారు వల్ల పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులు వ్యవసాయం నష్టపోతుందని తెలిపారు.నాణ్యత కలిగిన విత్తనాలతోనే నారు పెంచాలని సూచించారు.నకిలీ విత్తనాలు, నాణ్యత తక్కువ పంట నారు రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.నారు పెంచేదశలోనే పంటలో వచ్చే తెగుళ్లు, పురుగును గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.నర్సరీలపై, విత్తన సంస్థలపై రైతులు నమ్మకంతో ఉంటున్నందున నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పంటనారు అందించాలని కోరారు.రైతులు కూడా నకిలీ విత్తనాలు గుర్తించాలని చెప్పారు.నర్సరీలలో కొనుగోలు,అమ్మకాలకు సంబంధించి అన్ని విషయాలు రికార్డులో నమోదు చేసుకోవాలని సూచించారు.ఫర్టిలైజర్స్ యజమానుల నుండి ప్రతి రైతు ప్రతి దానికీ రశీదులు తీసుకోవాలన్నారు. నర్సరీల నుండి పంట నారు కొనుగోలు చేసి మోసపోతే నర్సరీలపై కేసులు నమోదు చేస్తామని, యజమానులపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావు, ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రాజేష్, ఆర్ఐ గోవిందరావు, ఎస్సై నవీన్, నర్సరీలు యజమానులు పాల్గొన్నారు.