Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-పెన్పహాడ్
ప్రజల కోసం పనిచేసే నాయకులను హతమార్చినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగవని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. బుధవారం మండలంలోని నాగులపాటిఅన్నారం గ్రామ ంలో అమరజీవి నకిరేకంటి వెంకటేశ్వరు ద్వితీయ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అంతకుముందు సిపిఎం సీనియర్ నాయకులు గుంజ వెంకటేశ్వర్లుతో కలిసి అమరజీవులను స్మరిస్తూ అరుణపతాకాన్ని ఆవిష్కరిం చారు.అనంతరం రాములు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు పార్టీ గ్రామ కార్యదర్శిగా బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు.దళిత కుటుంబంలో జన్మించిన ఆయన అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొందుతూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నసందర్బంలో ఓర్వలేని నరహంతక ముఠా దారి కాచి హత్య చేయడం హేయమైన చర్య అన్నారు.వెంకటేశ్వర్లు హత్యతో అన్నారం గ్రామంలో పార్టీ కనుమరుగవుతుందని భ్రమపడుతున్నారని, అమరుల స్ఫూర్తితో గ్రామంలో ఎర్రజెండాకు పూర్వవైభవం వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్తా కృషి చేయాలన్నారు.కరోన కష్టకాలంలో పార్టీ తమ పార్టీ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు అండగా నిలబడి సేవలందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్వర్మ, పార్టీ మండలకార్యదర్శి రణపంగ కృష్ణ, జీఎంపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి వీరబోయిన రవి, సీనియర్ నాయకులు గుంజ వెంకటేశ్వర్లు, గ్రామసర్పంచ్ ధనియాకుల కోటమ్మ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ధనియాకులలక్ష్మమ్మ, అయితబోయినసత్యం, వెంకన్న, తారమ్మ, మట్టయ్య, నకిరేకంటి వెంకన్న, సత్యం, భిక్షం, లక్ష్మమ్మ, లచ్చయ్య, శ్రీనివాస్, అభిలాష్, నర్సయ్య, వీరస్వామి, నరేందర్, గోపీ, శ్రీకాంత్, సతీష్, శ్రీరామ్, రజిత పాల్గొన్నారు.