Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
కోవిడ్ సమయంలో కరోనా వచ్చిన పేషెంట్ల వద్దకు వెళ్లి వారికి సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి మున్నూరు కాపు ట్రస్టు ఆధర్యంలో బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమని, దీనికి నిలువెత్తు నిదర్శనంగా సూర్యాపేట మున్నూరు కాపు ట్రస్ట్ నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో జిల్లా మున్నూరు కాపు ట్రస్టు ఆధ్వర్యంలో దాదాపు రూ.4 లక్షల వ్యయంతో 200 మంది ఆస్పత్రి సిబ్బందికి బియ్యం పంపిణీని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రోగులకు సపర్యలు చేస్తూ మన్ననలు పొందుతున్న సిబ్బంది సేవలు మరువలేనివన్నారు.కుటుంబసభ్యులకు కరోనా సోకిందని తెరవగానే దూరంగా ఉండే ఈ సమాజం ఏ బంధుత్వం లేని ఆస్పత్రి సిబ్బంది దగ్గరగా ఉండి సపర్యలు చేసి తిరిగి ఆరోగ్యవంతులుగా చేసి ఇంటికి పంపుతున్నారన్నారు.అలాంటి వారికి ఏమి చేసినా తక్కువే అన్నారు.ఈ సమయంలో మున్నూరు కాపు ట్రస్ట్ కలిసికట్టుగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.మున్ముందు మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు గాలిశ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు లైఫ్ స్టయిల్ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు నల్లగుంట్ల అయోధ్య, పెద్దిరెడ్డి గణేష్, పెద్దిరెడ్డిరాజా, ప్రధానకార్యదర్శి భాగ్యశ్రీ వెంకన్న, జాయింట్ సెక్రెటరీ ఉప్పు శ్రీను, ఎలిమినేటి వెనూదర్,డేగలకృష్ణ, ఏపూరు శ్రవణ్‌కుమార్, బచ్చుపల్లి శ్రీనివాస్, ఉప్పు నరేందర్, కర్నాటి శ్రీను, తుతుకు మోహన్‌రావు, గాలి చినశ్రీనివాస్, నల్లగుంట్ల సందీప్, రవి, గాలిసుధీర్, గాలిఅభిలాష్, గాలిసాయికిరణ్, డాక్టర్ గాలి నవ్యశ్రీ పాల్గొన్నారు.