Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
బొమ్మలరామారం : మండలంలోని ఫకీర్ గూడెం,మేడిపల్లి ,మైలారం గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు గురువారం బీర్ల ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల్ల ఐలయ్య గుడ్లు, మాస్కులు పంపిణీచేశారు. బాధితులు అధైర్యపడొద్దని మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, ఆయా గ్రామాల శాఖా తాళ్ల మహేష్ ,ఆగం రెడ్డి , జంగా రెడ్డి , మోటే వెంకటేష్, బసరం బాబు పాల్గొన్నారు.
మోత్కూరు : మున్సిపల్ కేంద్రానికి చెందిన అన్నందాసు శ్రీనివాస్ ఇటీవల మతి చెందాడు. బుధవారం ఆ కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్, యాంటీ క్రైమ్ బ్యూరో యాదాద్రి జోనల్ డైరెక్టర్ బాదె లక్ష్మీనారాయణ 25 కిలోల బియ్యం, పది రకాల నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుపోతుల వెంకన్న, డి.ప్రణీత్, ఎండి.షాకీర్, బి.శ్రవణ్, బి.సతీష్, ఎం.నర్సింహ, జి.అఖిల్, కెరవి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చిర్ర గూడూరు గ్రామ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మండలంలోని అజీమ్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు లింగాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖమ్మం పాటి పరమేష్ గౌడ్ ,ఎంపీపీ దర్శనాలు అంజయ్య, మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్, నాయకులు శ్రీ రాముల అయోధ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మహేంద్రనాథ్ ,ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు అంథోని, పాల్గొన్నారు.
మండలంలోని జర్నలిస్టులకు బుధవారం జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య ,టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్,చిర్రాగుడుర్ గ్రామ సర్పంచ్ ఖమ్మం పాటి పరమేష్ గౌడ్ 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాలు అంజయ్య, మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు ,గ్రామ సర్పంచ్ త్రివేని దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.