Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిట చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో డైరెక్టర్లతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయడానికి నడుం బిగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్్ గ్యాదపాక నాగరాజు, మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బొట్ల పరమేశ్వర్,ఆలేరు మాజీ సర్పంచ్ చింతకింది మురళి , రాఘవాపురం సర్పంచ్ రాంప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మామిడాల నరసింహులు, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి,బీజు నాయక్, మార్కేట్ కమిటీ సెక్రెటరీ చంద్రశేఖర్, సూపర్ వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.