Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఇబ్బందులు తొలగలేదు
- డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి మారలేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఐకేపీ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. సుమారు 45 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ధాన్యాన్ని రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారితో ఫోన్లో మాట్లాడుతూ పట్టణంలో చిన్నకారు సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని, ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో త్వరితగతిన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, బీసీసీఐ మాజీ కార్యదర్శి తంగళపల్లి రవికుమార్, బిసుకుంట్ల సత్యనారాయణ, ఎండి మేజర్, అవెస్, తాడూరి నరసింహ పాల్గొన్నారు.