Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవ తెలంగాణ -భువనగిరిరూరల్
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివద్ధి, సంక్షేమ రంగాల్లో ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత రాష్ట్రం స్వయంపాలన లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఎందరో త్యాగాలు చేశారని, వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ముందుగా పట్టణంలోని అమరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు గా ప్రభుత్వ విప్ సునీత మహేందర్రెడ్డ్డి నివాళులర్పించారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరబడంబరంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, అధికారులకు, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివద్ధికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ సందీప్ రెడ్డి, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, డీసీపీ నారాయణరెడ్డి , కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరచారి, డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.