Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో మృతి చెందిన తల్లి
- అనాథగా మారిన పిల్లలు
వతెలంగాణ - మునుగోడు
చిన్న వయసులో అమ్మను కోల్పోయి పిల్లలు అనాథలా మిగిలిన సంఘటన మండలంలోని ఊకోండి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుష్పలతను పలివెల గ్రామాలకు చెందిన కూరుపాటి అంజయ్యకు వచ్చి పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా పుష్పలత అనారోగ్యానికి గురైంది. పేద కుటుంబం అయినా మెరుగైన వైద్యం అందించారు. అయినా ఫలితం లేక ఆమె వారం రోజుల క్రితం మృతి చెందింది. చిన్న వయస్సులోనే బిడ్డలు అమ్మను కోల్పోయి అనాథగా మిగిలి పోవడం, అమ్మ ఏదని వచ్చిన వారందర్నీ అడగడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి.
నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయం
విషయం తెలుసుకున్న నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ మునుగోడు ఇన్చార్జి మేడి యాదగిరి బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ చిన్నారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊకోండి వార్డు సభ్యులు మేడి మాధూరి, నేస్తం సేవా సంస్థ కార్యదర్శి పందులు హరీష్, కట్లకుట్లు మల్లేశ్, మేడి నర్సింహా, మేడి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.