Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు.బుధవారం మండలంలోని బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు, ఆసుపత్రికి, అవసరమైన, ఆక్సిమీటర్లను ఆయన ఆ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్దస్వామితో కలిసి వైద్యాధికారి ద్రాక్షయనికి అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనాబాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. వారికి అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆపదో ఉన్నవారికి అంబులెన్స్ సదుపాయం కల్పించామన్నారు. కరోనా బారిన పడి మతి చెందిన కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలపార్టి అధ్యక్షుడు కోట పెద్దస్వామి, వలందాస్ ఆదినారాయణ, నుచ్చు నాగయ్య యాదవ్,చిక్కుల వెంకటేశం,శివకుమార్,కష్ణారెడ్డి, శ్రీను, కొండల్,బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుంభంకు సన్మానం
కరోనా కష్టకాలంలో భువనగిరి ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్కుమార్రెడ్డిని బుధవారం మండలంలోని బెల్లేపల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏడుమేకల మహేష్ యాదవ్,దర్గాయి హరిప్రసాద్,కాకునూరి మహేందర్ ,కొల్లూరి రాజు,సుర్పంగ చందు, కనుకుంట్ల కొండల్, బాబు, బాల స్వామి ,నరసింహ అశోక్ ,వెంకటేష్ పాల్గొన్నారు.