Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని ఎరువుల, విత్తనాల దుకాణాలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సంతోషి,ఎస్ఐ బి.తిరుపతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలనే రైతులకు అమ్మాలని, రైతులు కొనుగోలు సమయంలో దుకాణం యజమాని సంతకంతో కూడిన బిల్ తీసుకుని, పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు మాదష్టికి తీసుకవస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.