Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
కరోనా సమయంలో నిర్మాణ పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పోలీసులు అడ్డుకోవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కోరారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ి్డ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌కు సంబంధించి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇచ్చిన సడలింపు సమయంలో భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న పనులు మధ్యలో వదిలేయలేరని తెలిపారు. పని పూర్తయ్యాక సాయంత్రం ఇండ్లకు వెళ్తారని అందుకు పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరించాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌కు బోర్డు ద్వారా వెంటనే నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో పనులు కోల్పోయిన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా రూ.పది వేలు చెల్లించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీడబ్ల్యుయూ జిల్లా అధ్యక్షులు గొరిగె సోములు, యూనియన్ నాయకులు బండారు శ్రీరాములు, నూనె అంజయ్య ఉన్నారు.