Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు పండించిన వరి ధాన్యం పై అంచనాలు లేవని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు అన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలదాటినా ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయలేదన్నారు. వ్యవసాయంమే ఆధారం చేసుకుని జీవనం గడుపుతున్న రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షం వల్ల ధాన్యం తడిసి మొలకెత్తుతోందన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కష్ణ, నాయకులు కొండం నాగభూషణం, రవి, సంతోష్, మల్లయ్య, పాల్గొన్నారు.