Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -నార్కట్పల్లి
రైతులంతా సమన్వయం పాటించాలని, పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు క్లస్టర్ (అమ్మనబోలు, పల్లెపహాడ్, బెండల్ పహాడ్ గ్రామాలు) రైతువేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతువేదికల నిర్మాణం దేశంలో ఒక చరిత్ర అన్నారు. కరోనా సంక్షోభంలోను ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నది ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విడిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నీటి బిందెలతో నిరసన వ్యక్తం చేసిన దాఖలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేవని అన్నారు. రైతుల కలల ప్రాజెక్ట్ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ సంవత్సరంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఎర్రకాలువ పెండింగ్ పనులకు ఎస్టిమేట్ జరిగిందని త్వరలో టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు. ఆర్గానిక్ పంటలే ఆరోగ్యానికి మేలని తెలిపారు, నూతన వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూ ది రెడ్డి నరేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి ఎడవెల్లి గిరి ప్రసాద్ ఆ గ్రామ సర్పంచ్ బద్దం వరలక్ష్మి రామ్ రెడ్డి , ఎంపీటీసీ కొంపల్లి సైదులు, మేకల రాజిరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ జాన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు నర్సిరెడ్డి సర్పంచ్ , జాన్ రెడ్డి మస్జిద్ కమిటీ అధ్యక్షులు పాషా ఏఈఓ లియాకత్ అలీ తదితరులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
అమ్మనబోలు మార్కెట్లోలో రైతులు అమ్మడానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు అమ్మనబోలు గ్రామానికి విచ్చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతు వేదిక ప్రారంభించకుండా రోడ్డు పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మిల్లర్ లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు .