Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనితారామచంద్రన్
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో సూపర్ స్పైడర్స్ (వాహకులను) శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ విడిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. శుక్రవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్తో కలిసి మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, మండల ప్రత్యేక అధికారాలతో గూగుల్ మీట్ నిర్వహించి, మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో రైతుబజార్లో కిరణం, లిక్కర్ షాపులు, నాన్ వెజ్ మార్కెట్ లు లాండ్రీ షాపు మొత్తం 12 రంగాలకు చెందిన దాదాపు 7, 800 మంది సూపర్ స్పైడర్స్ జిల్లా యంత్రాంగం గుర్తించి శనివారం నుంచి పది రోజుల పాటు వ్యాక్సినేషన్ పై అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. మండల కోఆర్డినేటింగ్ అధికారులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరు వ్యాక్సినేషన్ కేంద్రానికి విధిగా చేరుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కేంద్రంలో పాఠశాల, జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకుని , రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోజుకు 100 మందికిపైగా వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఈ గూగుల్ మీట్ లో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పరిపూర్ణ చారి, డాక్టర్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.