Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్
నవతెలంగాణ -చండూరు
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. లారీలు పెంచాలని,హమాలీ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు లారీలు ధాన్యం రవాణా చేస్తున్నాయని, అదనంగా 4 లారీలు ఏర్పాటు చేసి మిల్లుకు రవాణా చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రం లోనే అత్యధికంగా 7 లక్షలా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం,లక్షా 5 వేల రైతుల దగ్గర మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్,మార్కెట్ యార్డ్ లలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఇప్పటి వరకు కొనుగోలు చేసిన రైతులకు 1000 కోట్లు చెల్లిచినట్టు తెలిపారు.ఇంకా జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో 20 వేల నుండి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు.ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల శాఖ డి.యం. నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు ఉన్నారు.