Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహడ్
ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీవిత్తనాలు, ఎరువులు విక్రయించినా, విక్రయించి పట్టుబడినా కఠినచర్యలు తప్పవని ఎస్సై బి.శ్రీకాంత్‌గౌడ్ అన్నారు.శనివారం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.దుకాణాల్లోని విత్తనాలు, ఎరువులను పరిశీలించారు.ప్రభుత్వ గుర్తింపు కలిగిన లేబుల్గల వాటిని పరిశీలించారు.నకిలీ విత్తనాలు విక్రయించి అమాయక రైతులను మోసంచేస్తూ వారిని శ్రమదోపిడీకి గురిచేస్తే సహించబోమన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు నకిలీ విత్తనవ్యాపారులపై పీడీ చట్టంకింద కేసులు నమోదుచేసి జైలుకు పంపు తామన్నారు.పొలంలో విత్తనం నాటే మొదలు పంట చేతికొచ్చేవరకు పెట్టుబడిపెట్టి నేలతల్లిని నమ్ముకునే రైతును మోసంచేయడం సబబు కాదన్నారు.ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు విత్తనాలను,ఎరువులను అదిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి ఆవుల స్పందన అన్నారు. శుక్రవారం మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు రశీదు పొందాలన్నారు.పత్తి విత్తనాల ప్యాకెట్లను ప్రభుత్వం నిర్ణయించిన రూ.767 ధరకే విక్రయాలు జరగాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాంపల్లి: వర్షాకాల పంటలకు సంబంధించి విత్తన కొనుగోళ్లకు సమయం ఆసన్నమైనందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి బొడ్డుపల్లి.హరి వెంకటప్రసాద్ రైతులను కోరారు.ఆయన విలేకర్లతో మాట్లా డారు.రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు రశీదు తీసుకోవాలన్నారు.
మునగాల :విత్తన వ్యాపారులు రైతాంగానికి నాణ్యమైన పత్తి విత్తనాలను సరఫరా చేయాలని కోదాడ ఏడీఏ వాసు సూచించారు.శుక్రవారం మండలంలోని మునగాల, నర్సింహుల గ్రామాల్లోని విత్తనదుకాణాలను మండల వ్యవసాయఅధికారి బాణోత్ అనిల్‌కుమార్‌తో కలిసి అకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కల్తీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం దుకాణాల్లోని రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు.