Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ : నల్లమోతు సిద్ధార్థ
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరోనాలాంటి క్లిష్ట సమయంలో ఆర్ధిక ఇబ్బందు లెదుర్కొంటున్న ఆటో మెకానిక్స్‌కు తమ వంతుగా చేయూతనందించినట్టు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ సిద్ధార్థ తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆటో మెకానిక్‌లకు ఐదు కిలోల బియ్యం, 10రకాల నిత్యావసర సరుకులను శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా రెండో దశ విజంభణ నేపథ్యంలో కేసుల కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం గతనెల 12 నుంచి లాక్డౌన్ విధించిందన్నారు.ఈ నెల 9వరకూ ప్రత్యేక సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగిం చిందన్నారు.వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున సమర్ధవంతంగా అన్ని వర్గాల వారికి టీకాలు వేయించే కార్యక్రమాన్నిప్రభుత్వం చేపడు తోందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, ఐల వెంకన్న, కమిలీ భీమ్లానాయక్, సాధినేని శ్రీనివాస్, మాజిద్, లక్ష్మీనారాయణ, బాసానిగిరి, ఖాజా, పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, అహ్మద్ పాల్గొన్నారు.