Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
గుండ్రాంపల్లికి చెందిన ప్రవాస భారతీయుడైన నక్కెర్తి రామాచారి , తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నక్కెర్తి శ్రీనివాసాచారి తల్లిదండ్రులు కీర్తిశేషులు నక్కెర్తిలక్ష్మీనారాయణ, సత్యమ్మ గార్ల పేరుమీద శుక్రవారం గుండంపల్లి గ్రామంలో 30 మంది కరోనా బాధితులకు పది రకాల నిత్యావసర వస్తువులు, శానిటైజర్ , 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మెన్ రాచకొండ కిష్టయ్య , అనుముల శ్రీనివాస్, గరిసె రవికాంత్ ,మండలోజు శ్రీనివాసాచారి, కంచర్ల నారాయణ చారి పాల్గొన్నారు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన జంపాల గోపాల్ దీర్ఘకాలికంగా కండరాల క్షీణత తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ వారు శుక్రవారం రోజు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 500 రూపాయలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలిమినేటి మల్లేష్, బొడ్డుపల్లి బాలకష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జంపాల గోపాల్ మరియు కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కతజ్ఞతలు తెలిపారు.