Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని ఏఓ రామలింగేశ్వర్రావు, సీఐ సత్యం హెచ్చరించారు.శుక్రవారం మండలంలోని మాల్లో ఊరె యాదయ్య గార్డెన్స్‌లో వ్యవసాయ, పోలీసుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు సమావేశం నిర్వహించారు.ముందుగా పోలీసులు పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ విత్తన డీలర్లు అమ్మకంలో గానీ, కొనుగోలు విషయంలో గానీ తగు జాగ్రత్తలు తీసుకొని కంపెనీకి సంబంధించి అన్నిపత్రాలను అందుబాటులో ఉంచు కోవాలన్నారు.ఉన్నతాధికారులు తనిఖీలో భాగంగా వచ్చినప్పుడు వారికి ఈ పత్రాలను చూపించడంతో పాటు కావాల్సిన సమాచారం అందజేయాలన్నారు. గ్రామాల్లో లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మినట్టయితే వారిపై 420 కేసులు నమోదు చేస్తామన్నారు.గ్రామాల్లో బయట వ్యక్తులు వచ్చి వారు అనధికారికంగా పత్తి విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందజేయాలన్నారు.ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఈఓ మధు, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ గ్యారపోశయ్య, డీలర్ల సంఘం అధ్యక్షలు పుల్లారెడ్డి, వాస శ్రీనివాస్, మాస భాస్కర్, పులిరాజు, డీలర్లు పాల్గొన్నారు.
మిర్యాలగూడ :నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మండల వ్యవసా యాధికారి బొలిశెట్టి శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ సదా నాగరాజు, రూరల్ సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. మండల ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన, కల్తీ లేని విత్తనాలనే రైతులకు అమ్మాలని, రాబోయే సీజన్లో విత్తనాలు, ఎరువులు సరిపోయే విధంగా ప్రభుత్వం ప్రణాళిక నిర్వహించిందని, ఇది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవన్నారు. ఎరువులు, విత్తనాల అమ్మకాలపై పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుందని, ఎవరూ కూడా కల్తీ విత్తనాలను విక్రయిం చరాదన్నారు.ఈ సమావేశంలో రూరల్ ఎస్సై సుధీర్, డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెడ్ల జవహర్‌బాబు, ఆలంపల్లి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, వాసు, డీలర్లు పాల్గొన్నారు.
కోదాడరూరల్ :నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ శివరామిరెడ్డి దుకాణాదారులను హెచ్చరించారు.మండలపరిధిలోని గ్రామీణప్రాంతాల్లో పలు ఎరువుల, విత్తనాల దుకాణాలలో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. విత్తనాలు అమ్మే దుకాణదారులు అందరూ కూడా నాణ్యమైన కల్తీలేని విత్తనాలు అమ్మాలని సూచించారు.నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సైదులు, ఏఓ పాలెం రజిని, ఏఈఓ మహేష్ పాల్గొన్నారు.