Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మిర్యాలగూడ
కరోనా లాంటి విపత్కత పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటిస్తున్న పలు నిరుపేద కుటుంబాలకు నల్లమోతు భాస్కర్‌రావు(ఎన్బీఆర్) ఫౌండేషన్ అండగా నిలిచింది. కరోనా కేసుల కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నబుడిగ జంగాలకు ఎన్బీఆర్ ఫౌండేషన్చైర్మెన్ నల్లమోతు సిద్ధార్థ భోజనం పొట్లాలను పంపిణీ చేశారు.మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్‌నగర్, బాపూజీనగర్‌లలో ఆయన శుక్రవారం పర్యటించారు. గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా పలకరిస్తూ భోజనం పొట్లాలను స్వయంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, ఐల వెంకన్న, కమిలీ భీమ్లా నాయక్,సాధినేని శ్రీనివాస్, మాజిద్, లక్ష్మీనారాయణ, బాసాని గిరి, ఖాజా, పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, అహ్మద్ పాల్గొన్నారు.