Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు, కల్తీఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆంజనేయులు హెచ్చరించారు.శనివారం మున గాలలో పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు పలు దుకాణాలను అకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు కచ్ఛితంగా రైతులకు స్టాక్ బోర్డు కనిపించే విధంగా ఉంచా లన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ శ్రీనివాసులు, ఏడీఏ వాసు, వ్యవసాయాధికారి బాణోతుఅనిల్కుమార్ పాల్గొన్నారు.
అర్వపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తుంగతుర్తి ఏడీఏ జగ్గునాయక్ అన్నారు.మండలకేంద్రంలో విత్తనాలను విక్రయిస్తున్న షాపులను తనిఖీ చేశారు.గ్రోమోర్ విత్త నాలను పరిశీలించి మాట్లాడారు.రైతులకు విత్తనాలు షాపుల ద్వారా నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.లైైసెన్స్ లేని షాపుల్లో విక్రయాలు చేయొద్దన్నారు.ఆయన వెంట మండల వ్యవసాయాధికారి దినకర్, గ్రోమోర్ విక్రయదారులు రమేశ్‌బాబు, నాగరాజు ఉన్నారు.
నేరేడుచర్ల:మండలకేంద్రంలోని జాన్‌పహాడ్ రోడ్లో గల పలు ఫర్టిలైజర్ షాపులను, విత్తన విక్రయకేంద్రాలను ఎస్సై యాదవేంద్రరెడ్డి ఆక స్మికంగా తనిఖీ చేశారు.ఆయన వెంట ఏఈఓ అన్వేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
తిరుమలగిరి: రైతులకు ఎవరైనా కల్తీ విత్తనాలు విక్రయించినట్లు అయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో వెంకటేశ్వరులు హెచ్చరించారు. మండలకేంద్రంలోని విత్తన డీలర్ షాప్‌లను తనిఖీ చేశారు.ఆయన వెంట ఎస్సై లోకేష్ ఉన్నారు.
తుంగతుర్తి: నకిలీ విత్తనాలను విక్రయించే దుకాణదారులపై చర్యలు తప్పవని తుంగతుర్తి సీఐ రవి కుమార్ అన్నారు.మండల పరిధిలోని వెలుగు పల్లిలో పలు ఫర్టిలైజర్ షాపులను మండల టాస్క్‌ఫోర్స్ బందం ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు,మండల వ్యవసాయ అధికారి బాలకష్ణ,ఎస్ఐ ఆంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
చింతలపాలెం:మండలంలోని విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని మండల వ్యవసాయ అధికారి షేక్ జావేద్ అన్నారు.మండల కేంద్రంతో పాటు మండలంలోని దొండపాడు, గుడిమల్కాపురం గ్రామాలలో హుజూర్నగర్ వ్యవసాయ సహాయ సంచాలకులు పి సంధ్యారాణి, కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి, ఎస్సై రంజిత్‌రెడ్డి విత్తన, ఎరువుల దుకాణాలు తనిఖీలు నిర్వహించారు.