Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్
నవతెలంగాణ - మోత్కూర్
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో క్రీడాకారులు రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సూచించారు. నేపాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మండలంలోని పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి నవీన్, దాచారం గ్రామానికి చెందిన సురారం నవీన్, అడ్డగుడూర్ మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ఈదుల సాయిప్రశాంత్లను శనివారం ఆయన అభినందించారు. క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. తుంగతుర్తి ప్రాంతానికి చెందిన గ్రామీణ క్రీడాకారులు రాష్ట్రం తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, నాయకులు బొడిగ రమేష్, పబ్బు బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.