Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోటకొండూర్
రాష్ట్రంలో అనారోగ్య పాలన సాగుతోందని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర మల్లేష్‌యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం మండల పరిధిలోని మాటూరు గ్రామపంచాయతీ సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు, వీఆర్ఏలకు మాస్క్‌లు, శానిటైజర్లు, సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనాను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సకాలంలో వ్యాక్సిన్ వేయక, ఆస్పత్రుల్లో బెడ్లు లేక అనేక మంది చని పోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైరపాక యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు అనంతుల లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బంటు సిద్ధులు, వార్డు సభ్యులు జలతారు రాజు, వర్టూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు భూమండ్ల మహేష్, వడ్డెబోయిన పాండు, ఎరుకల గణేష్, కొరటికంటి శ్రీకాంత్, బండ్రు క్రాంతి, కుమార్, నరేష్, బండ్రు స్వామి, మాజీ ఉపసర్పంచ్ మాటూర్ రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వీఆర్ఏలు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.