Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - రామన్నపేట
ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. శనివారం మండలంలోని బాచుప్పల గ్రామంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలు, గర్భిణులకు టీకా వేసే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. చిన్న పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని ప్రతి క్షణం కనిపెడుతూ ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దోమల సతీష్, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.