Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు
- డీఎస్పీ మోహన్‌కుమార్
నవతెలంగాణ-సూర్యాపేట
నకిలీ మిర్చి విత్తనాలను పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.డీఎస్పీ మోహన్ కుమార్ వివరాలను శనివారం వెల్లడించారు.శుక్రవారం సాయంత్రం పట్టణ సీఐ అంజనేయులు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానితంగా స్విఫ్ట్ డిజైర్ కారు రాగా పోలీసులు ఆపారు.కారులో తనిఖీ చేయగా మిర్చి విత్తనాలు ఉన్నాయి.దీంతో కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.మిర్చి విత్తనాలకు అనుమతులేక పోవడంతో పోలీసులు మండల వ్యవసాయాధికారికి సమాచారం అందజేశారు.విత్తనాలను వినుకొండ నుండి మహబూబాబాద్‌కు తరలిస్తున్నట్టు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.11 కంపెనీలకు చెందిన మిర్చి సీడ్స్ 2023 ప్యాకెట్లు ఉన్నాయి.వీటి విలువ రూ.10,92,155 ఉంటుంది.వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.చాకచక్యంగా వ్యవహరించి విత్తనాలను పట్టుకున్న సీఐ అంజనేయులు, ఎస్సై పడిశాల శ్రీనివాస్,ఆర్ఎస్సై సంతోష్, సిబ్బంది కృష్ణయ్య, జె.సైదులు, కె.శ్రవణ్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు.