Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- విలేకర్ల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
వానాకాలం సీజన్ ప్రారంభమైందని, ఈ సీజన్లో నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లో వచ్చాయని, వీటిని వెంటనే అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం సీజన్లో నకిలీలను అరికట్టి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నవ్యాపారులపై నిఘా ఉంచి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అధిక దిగుబడి వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.వెంటనే ప్రభుత్వం వానాకాలం ప్రణాళికను ప్రకటించి రైతులకు ప్రోత్సహించి వారికి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం అప్పుడప్పుడు కురుస్తున్నవర్షాల కారణంగా జిల్లాలో కొన్నిచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసి ఉందని, అట్టి దాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయా లన్నారు.అవసరమైన గోనెసంచులు, రవాణాచార్జీలు కూడా ప్రభుత్వమే భరించాలన్నారు.నిలిచిపోయిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రైతులకు రెండు నెలలు గడుస్తున్నా..బిల్లులు అందలేదని, దీని కారణంగా వర్షాకాలం సీజన్లో పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నారని వాపోయారు.