Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
- రైతు వ్యతిరేక చట్టాల బిల్లుల ప్రతులు దహనం
నవతెలంగాణ-సూర్యాపేట
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, న్యూడెమోక్రసీ(చంద్రన్నవర్గం) జిల్లా నాయకులు కొత్తపల్లి శివ కుమార్, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న, సీపీఐఎంఎల్ రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య డిమాండ్ చేశారు.శనివారం వామపక్ష రైతు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్ 5 నాటికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి, రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 లో జూన్ 5న లోక్‌నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ బీహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ర్యాలీ నుండి సంపూర్ణ క్రాంతి ఆందోళన్‌ను ప్రకటించారన్నారు.దానిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ రైతు సంఘాలు జూన్ 5న సంపూర్ణ క్రాంతిదివస్ను నిర్వహిస్తున్నామన్నారు.కోవిడ్ లాక్డౌన్ సమయంలో మోడీ ప్రభుత్వం మూడు నల్లవ్యవసాయ చట్టాలను మొదట ఆర్డినెన్సుల రూపంలో జూన్ 5, 2020న తీసుకొచ్చిందన్నారు.అప్పటి నుంచి నిరవధికంగా భారత రైతాంగం పెద్దఎత్తున ఉద్యమిస్తున్న కనీస ఆలోచన చేయకుండా దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయచట్టాల అమలుతో లాభాలే ధ్యేయంగా కార్పొరేట్‌శక్తులు పర్యావరణాన్ని ధ్వంసం చేసి సమాజానికి హాని కలిగిస్తారన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ సుస్థిరత సమస్యలను నొక్కిచెప్పడానికి జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున సంపూర్ణ క్రాంతిదివాస్ పేరుతో వ్యవసాయ నల్ల చట్టాల ప్రతులను దహనం చేస్తున్నామన్నారు.రైతాంగానికి, ప్రజానీకానికి తీవ్రనష్టం చేసే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించే వరకు, రైతాంగం డిమాండ్ చేస్తున్న విధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించే చట్టం సాధించేంతవరకు, రైతుల ఆత్మహత్యలు పరంపరను ఆపేందుకు కేరళ తరహా రుణ విమోచన చట్టం సాధించేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, న్యూ డెమోక్రసీ నాయకులు కారింగుల వెంకన్న, షేక్‌సయ్యద్, ఇందూరిసాగర్, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ నజీర్, న్యూ డెమోక్రసీ(చంద్రన్నవర్గం) జిల్లా నాయకులు దొంతమల్ల రామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు గోపిరెడ్డి కేశవ రెడ్డి, నారాయణ వీరారెడ్డి, రెడ్డిమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.