Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ధరావత్ కుమారిబాబునాయక్, జెడ్పీటీసీ భూక్యా సంజీవ్‌నాయక్ అన్నారు.శనివారం మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. రోళ్లబండ తండా, మున్యా నాయక్‌తండా,గుంజలూరుతో పాటు పలు గ్రామాలలో స్కీం బోర్లు తొలగించడంతో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు సభ దష్టికి తీసుకొచ్చారు. అదేవిదంగా వట్టిఖమ్మంపహాడ్ ఎంపీటీసీ వాసుదేవరావు గ్రామంలోని పెద్ద చెరువుకు ఎస్సారెస్పీ నీళ్లతో చెరువును నింపాలని, చెరువు కి కాలువలను ఏర్పాటు చేయాలని, రైతుల సౌకర్యార్థం అండర్ పాస్ ఏర్పాటు చేయా లన్నారు.వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తమ ఎజెండాలను సభ ముందు వివరించారు.అదేవిధంగా గత ప్రభుత్వాలలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించే విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని సర్పంచులు కోరారు. అనంతరం ఎంపీపీ ధరావత్ కుమారిబాబునాయక్, జెడ్పీటీసీ సంజీవ్ నాయక్, పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు మాట్లాడుతు రైతులు వరి పంట మాత్రమే కాకుండా, లాభసాటి పంటల వైపు ముగ్గు చూపాలని, గ్రామాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే విధంగా అవగాహన కల్పించాలన్నారురాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని కచ్ఛితంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.విత్తనాలపై సబ్సిడీలు, పెద్ద చెరువుకు ఎస్ఆర్ఎస్వీ కాలువ సదు పాయం, రైతుల సౌకర్యార్థం అండర్‌పాస్ ఏర్పాటు విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి దష్టికి తీసుకెళ్తామని తెలిపారు.మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరై ప్రజా సమస్యలను సభ దష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమాలరెడ్డి, ఏపీవో నాగయ్య, ఎంపీఓ గోపి, ఆశాకుమారి, వెంకన్న పాల్గొన్నారు.