Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
మొక్కలను నాటి వాటి ఎదుగుదలకు పూర్తి స్థాయిలో సంరక్షించాల్సిన బాధ్యత మనందరిదని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట మొక్కలు నాటి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుందని,ప్రతి ఒక్కరూ ఇంటి ముందు బాధ్యతతో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు. ఉదరు, టీఆర్ఎస్ నాయకులు ప్రజ్ఞాపురం రామకృష్ణ, మేకల కరుణాకర్‌రెడ్డి, నాగరాజు, సంపత్, వెంకట్, నరేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.