Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గాదె శేషమ్మ(72) కరోనా మహమ్మారి బారినపడి మతి చెందారు. కరోనా కారణంగా ఆమె మతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధుమిత్రులెవరూ ఆమె భౌతికకాయాన్నికడసారిగా సందర్శించేందుకు ముందుకు రాలేదు. ఆమె అంతిమసంస్కారాల నిర్వహణ కుటుంబ సభ్యులకు పెనుసవాల్‌గా మారింది.శేషమ్మ అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన రెహ్మాన్ ఖాన్ కరోనా బారినపడి మతిచెందిన భౌతిక కాయాల ఆఖరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో, పలు న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న విషయం శేషమ్మ కుటుంబ సభ్యులకు గుర్తుకు వచ్చింది. వెంటనే రెహ్మాన్ ఖాన్ సెల్ నెంబర్ సేకరించి కాల్ చేశారు. సాయం కోసం అర్ధించిన కాసేపు వ్యవధిలోనే తన సొంత వాహనంలో రెహ్మాన్ ఖాన్, బందం అబ్బిరెడ్డిగూడెంకు చేరుకోవడం గ్రామస్తులకు విస్మయం కలిగించింది.కరోనా సోకి మతిచెందిన శేషమ్మను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆదరిస్తూ హిందూ శ్మశానవాటికు రెహ్మాన్‌ఖాన్ తరలించిన తీరును ప్రత్యక్షంగా చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.రెహ్మాన్ ఖాన్ సేవానిరతిని చూసి నివ్వెరపోయారు. మానవత్వానికి రెహ్మాన్ ఖాన్ ప్రతీక అంటూ అభినందించారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం స్మశానవాటికకు రెహ్మాన్ ఖాన్ చేరుకొని శేషమ్మ అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించారు.మిర్యాలగూడ నియో జకవర్గంతో పాటు, పొరుగు నియోజకవర్గాల్లోనూ కరోనా లాంటి విపత్కత పరిస్థితుల్లో రెహ్మాన్ ఖాన్ నిర్వర్తిస్తున్నసేవలు ప్రతీ ఒక్కరిలో స్పూర్తి నింపేలా ఉన్నాయి. కరోనాతో మతి చెందినవారి ఆఖరి మజిలీని గౌరవప్రదం చేద్దామని రెహ్మాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. సాయం కోసం తనను 9849717537, 9848285095 సెల్ నెంబర్లతో సంప్రదించాలని కోరారు.